బాహుబలి 2 దగ్గర్లో రంగస్థలం..

0చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఓపెనింగ్ డే నుండి వారం పూర్తి అయినా కానీ ఎక్కడ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి తగ్గలేదు. ఇప్పటికే గత చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వస్తున్న ఈ మూవీ , తాజాగా చెన్నై సిటీలో అయితే 8 రోజులకు కలిపి కోటి రూపాయల గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా ‘బాహుబలి-1’ ను దాటేసి ‘బాహుబలి-2’ తర్వాతి స్థానంలో నిలించింది.

ప్రస్తుతం తమిళ నిర్మాతల మండలి చేస్తున్న నిరసన మూలం గా తమిళ చిత్ర రిలీజ్ లు ఆగిపోవడం తో రంగస్థల కలెక్షన్లకు తీరుగులేకుండా పోయింది. కేవలం చెన్నై సిటీలోనే కాదు ఓవర్సీస్లో సైతం రంగస్థలం హావ బాగా కొనసాగుతుంది. తాజాగా విడుదలైన చల్ మోహన్ రంగ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం తో ప్రేక్షకులంతా రంగస్థలానికే మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓవర్సీస్ లో రంగస్థలం 2.8 మిలియన్లను క్రాస్ చేసి 3 మిలియన్ల వైపు పరుగులు పెడుతుంది.