రంగస్థలం సక్సెస్ మీట్ ముఖ్య అతిధులు వీరే..

0మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకున్న ఇంకా చాల చోట్ల టికెట్స్ దొరకని పరిస్థితి..ఇంత సూపర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పటు చేయబోతుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ సక్సెస్ మీట్ ను భారీగా ఏర్పటు చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారట. నిన్న చరణ్ తో కలిసి ‘రంగస్థలం’ను వీక్షించిన పవన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సినిమా గురించి సక్సెస్ మీట్లో మాట్లాడుతానంటూ తాను కూడ హాజరవుతున్నట్టు చెప్పకనే చెప్పారు. మొత్తానికి చాల రోజుల తర్వాత చరణ్ కు మెగా హిట్ రావడం , ఇప్పుడు సక్సెస్ మీట్ కు చిరు , పవన్ లు రాబోతుండడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.