దీపిక కూడా డేట్ ఫిక్స్ చేసేస్కుందా?

0బాలీవుడ్ లో మ్యారేజ్ సీజన్ ఫుల్లు స్పీడ్ లో నడుస్తోంది. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్ లు ఇప్పటికే పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బాలీవుడ్ టాప్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా ఇదే బాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. రణవీర్ సింగ్ తో దీపిక ప్రేమాయణం అంత సీక్రెట్ ఏమీ కాదు. ఎప్పటికప్పుడు తమ ప్రేమ నిషా గురించి.. లవ్ లో లోతుల గురించి సోషల్ మీడియా సాక్షిగా.. కెమేరా కళ్లకు చిక్కేలానే చూపిస్తూ ఉంటుంది.

దీపికా పదుకొనే- రణవీర్ సింగ్ ల ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందని.. పెళ్లికి కూడా రెడీ అయిపోయారని ఇప్పటికే టాక్ ఉంది. ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా గతంలోనే వచ్చాయి. అయితే.. ఇప్పుడు అసలు వ్యవహారం ఏంటంటే.. ఇప్పుడు వీరి ఇరువురి ఫ్యామిలీ మెంబర్స్ కలిసి.. పెళ్లి ముహూర్తం కూడా ఖాయం చేసేసుకున్నారట. నవంబర్ 10వ తేదీన వీరి పెళ్లి ముహూర్తం ఖరారైందని.. ఇప్పటికే ఈ డేట్ కు అనుగణంగా తమ తమ షెడ్యూల్స్ ను సెట్ రైట్ చేసుకున్నారని కూడా అంటున్నారు.

ఇద్దరి జాతకాల ప్రకారం కూడా నవంబర్ 10 అద్భుతమైన ముహూర్తం అని చెప్పారట. ఇప్పటికే ఈ పెళ్లికి అవసరమైన షాపింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయని అంటున్నారు. అయితే ఈ పెళ్లి ఏర్పాట్లపై దీపిక మాత్రం విచిత్రంగా స్పందిస్తోంది. పెళ్లి వ్యవహారం అంతా పేరెంట్స్ ఇష్టమని.. వారు ఎప్పుడు కరెక్ట్ టైం అని డిసైడ్ అయితే.. అప్పుడు తాను సిద్ధమని చెబుతోంది దీపికా పదుకొనే.