ఫుల్ జోష్ లో పెళ్ళి జంట

0

బాలీవుడ్ లవ్ జంట రణవీర్ సింగ్ – దీపిక పదుకొనే త్వరలో పెళ్ళి చేసుకొని భార్యాభర్తలుగా మారబోతున్నారనే విషయం తెలిసిందే. దీప్-వీర్ జంట ఇటలీలోని లేక్ కోమో లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు రెడీ అవుతున్నారు. నవంబర్ 14-15 వ తేదీలలో కొంకణీ సంప్రదాయం ప్రకారం.. సింధీ సంప్రదాయం ప్రకారం రెండు సార్లు పెళ్ళిచేసుకుంటారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే రణవీర్ దీపిక జంట ఈ రోజు తెల్లవారు ఝామున ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చింది. ఇటలీకి పయనమయ్యేందుకు ఈ జంట ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా? భార్యాభర్తలు కానున్న ప్రేమపావురాలు తెల్లటి దుస్తుల్లో కనిపించారు. ఇక ఇద్దరి మొహాల్లో పెళ్ళికళ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. దీపిక – రణవీర్ ల తో పాటుగా వారిద్దరి కుటుంబ సభ్యులు కూడా ఇటలీకి పయనమయ్యారు.

నవంబర్ 13 న దీప్-వీర్ ల సంగీత్ జరుగుతుందట. నవంబర్ 15 వ తేదీ రాత్రి గ్రాండ్ ఆఫ్టర్ వెడ్డింగ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారట. ఇక బాలీవుడ్ కొలీగ్స్ ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ను డిసెంబర్లో ముంబై లో ప్లాన్ చేస్తున్నారట. మరో వారం రోజుల వరకూ ఈ పెళ్ళికి సంబంధించిన వార్తలే బాలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్.
Please Read Disclaimer