నవంబర్ 20 పెళ్లి.. ఇది అఫీషియల్

0ఇన్నాళ్లు దీపిక పదుకొనే పెళ్లి మ్యాటర్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతోంది. ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఏ క్లారిటీ లేదు. ఓవైపు పెళ్లి పనులు జరుగుతున్న సంగతి అర్థమవుతున్నా.. ఫలానా తేదీ ఫిక్స్ అన్న మాట లేదు. అలానే ఈ వేడుక వెన్యూ ముంబైలో అన్న మాట క్లారిటీ వచ్చినా.. ఎంత మంది అతిధులో తేలనేలేదు. ముంబైలో వెన్యూ అని అన్నారు కాబట్టి – భారీగా అతిధులు విచ్చేస్తారని – ఇండస్ట్రీ మొత్తానికి పిలుపు అందుతుందని భావించారంతా.

కానీ దీపిక పెళ్లి ట్విస్టు అంతకంతకు ముదిరిపాకాన పడుతోంది. ఈ పెళ్లి ఫిక్సయింది. నవంబర్ 20 ముహూర్తం ఫిక్స్ చేసేశారు పంతుళ్లు. అయితే పెళ్లి వేడుకను కేవలం ఓ ప్రయివేట్ ఎఫైర్ గానే ఇరు కుటుంబాలు భావించి పరిమితంగా అతిధుల్ని ఆహ్వానించారట. కేవలం 30 మంది అతిధుల సమక్షంలో ఈవెంట్ ని కానిచ్చేస్తారని తెలుస్తోంది. ఇక ఎలానూ తర్వాత రిసెప్షన్ భారీగా ఉంటుంది కాబట్టి దానికి అతిధులు – సెలబ్రిటీలంతా విచ్చేస్తారని చెబుతున్నారు. ఆ మేరకు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.