ఇప్పటికే మా ఇద్దరికీ చాలాసార్లు పెళ్లి చేసేశారు

0

బాలీవుడ్ నటుల ప్రేమ.. పెళ్లి ముచ్చట్లు వచ్చినంతనే తొలుత గుర్తుకు వచ్చే జంట రణ్ వీర్ సింగ్.. దీపికా పదుకునే. వారిద్దరికి అప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యిందని ఒకసారి.. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేశారంటూ మీడియాలో వార్తలు రావటం మామూలే. తాజాగా వారిద్దరి పెళ్లి అంశంపై రణ్ వీర్ మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా వారిద్దరి పెళ్లి నవంబర్ కు వాయిదా పడిందన్న మాట జోరుగా వినిపిస్తున్న వేళ.. మీ పెళ్లి ఎప్పుడు? అన్న ప్రశ్నను ఒక కార్యక్రమంలో ఎదుర్కొన్నారు. దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో రణ్ వీర్.. తమ ఇద్దరికి ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేసేశారని.. ఆ మాటకు వస్తే తన పెళ్లి గురించి తనకు తెలియనన్ని కథనాలు వచ్చినట్లుగా వ్యాఖ్యానించారు.

నా పెళ్లి గురించే కాదు.. నేను వేసుకునే షేర్వాణీ కలర్ గురించి.. నా పెళ్లికి ఇచ్చే గిఫ్ట్ ల గురించి కూడా చాలానే వార్తలు వచ్చాయి.. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. నేను పెళ్లి చేసుకునేటప్పుడు అందరికి చెప్పే చేసుకుంటానని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన రణ్ వీర్ తో దీపికా కూడా పాల్గొన్నారు. ఈ ఇద్దరితో విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ కూడా హాజరయ్యారు.

లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటకు చెప్పాలని.. మహిళలపై లైంగిక వేధింపులు సరికాదన్నారు. మీటూ ఉద్యమం లింగ వివక్షకు సంబంధించింది కాదని.. తప్పొప్పులకు సంబందించిందన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఈ జంట పాల్గొన్న సందర్భాన వారి పెళ్లి వ్యవహారం రావటం.. దీనికి రణ్ వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం జరిగింది. మొత్తంగా తమ పెళ్లి ఎప్పుడన్న విషయాన్ని తేల్చని రణ్ వీర్.. పెళ్లి చేసుకుంటే మాత్రం చెప్పి చేసుకుంటానన్న స్పష్టత మాత్రం ఇచ్చారని చెప్పాలి.
Please Read Disclaimer