మహిళపై రేప్: నోటితో కొరికేసింది, రెండు సెంటీ మీటర్లు కట్

0Rapeపక్కింటిలో ఒంటరిగా ఉన్న మహిళ మీద అర్దరాత్రి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన యువకుడికి తగినశాస్తి జరిగింది. కామంతో రెచ్చినపోయిన యువకుడు ఇప్పుడు కేరళలోని కొచ్చి ఆసుపత్రిలో లబోదిబో అంటున్నాడు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేరళలోని ఎర్నాకుళం జిల్లా నారక్కల్ పట్టణంలో రాజేష్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాజేష్ ఇంటి పక్కనే వివాహిత మహిళ నివాసం ఉంటున్నది.

జులై 26వ తేదిన మహిళ భర్త పని మీద ఊరికి వెళ్లాడు. ఇంటిలో ఆమె ఒక్కటే ఉంది. మహిళ ఒంటరిగా ఉందని తెలుసుకున్న రాజేష్ అర్దరాత్రి ఆమె ఇంటిలో చొరబడి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది.

ఆమె చేతికి ఏమీ చిక్కకపోవడంతో లిప్ లాక్ చెయ్యడానికి ప్రయత్నించిన రాజేష్ నాలుకను నోటితో గట్టిగా పట్టుకుని రెండు ముక్కలు చేసింది. నాలుక తెగిపోవడంతో లబోదిబో అంటూ రాజేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మరసటి రోజు మహిళ ఫిర్యాదు చేశారని నారక్కల్ పోలీసులు చెప్పారు.

నాలుక తెగిపోయిన తరువాత రాజేష్ మాయం అయ్యాడు. అతని కోసం పోలీసులు గాలించారు. కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో రాజేష్ చికిత్స పొందుతున్నాడని బుధవారం పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో నాలుక తెగిపోయిందని రాజేష్ ఆసుపత్రిలో అపద్దం చెప్పి చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు.

రాజేష్ నాలుక కత్తిరించిన మహిళ రెండు సెంటి మీటర్ల నాలుక తమకు అప్పగించిందని పోలీసులు చెప్పారు. అయితే ఇప్పుడు రాజేష్ కు శాస్త్ర చికిత్స చేసి నాలుక అతికించడం కుదరదని వైద్యులు చెప్పారని, అతను కోలుకున్న తరువాత అరెస్టు చేస్తామని పోలీసులు అన్నారు.

ఇటీవల తిరువనంతపురంలో అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన స్వామీజి మర్మాంగాన్ని పూర్తిగా లా కాలేజ్ విద్యార్థిని కత్తితో కత్తిరించిన విషయం తెలిసిందే. కేరళలో స్వామీజి విషయం మరిచిపోకముందే అదే రాష్ట్రంలో ఇలాంటి మరో సంచనల ఘటన చోటుచేసుకుంది.