మెగా ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా..!

0Rashi-Khanna--and-varunసోలోగా అయినాసరే టాలీవుడ్ లో పాతుకుపోతోంది రాశి ఖన్నా. ఇప్పుడు ఈమె రెండు పెద్ద ప్రొజెక్ట్స్ లో చేస్తోంది. జూనియర్ ఎన్ టిఆర్ తో జై లవ కుశ.. ఇంకా రవితేజ టచ్ చేసి చూడు సినిమాలలో చేస్తోంది. అయితే అమ్మడి చేతిలో మరో మెగా ఛాన్స్ వచ్చి పడింది. పదండి అదేంటో చూద్దాం.

నూతన దర్శకుడు వెంకీ డైరక్షన్లో వరుణ్ తేజ్ చేయబోయే కొత్త ప్రేమ కథ సినిమాకి ముందుగా మెహ్రీన్ పీర్జాదాను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే కారణాలు తెలియవు కాని మెహరీన్ ను పక్కనెట్టేశారు. ఆ తరువాత ఈ స్క్రిప్ట్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరకు వెళ్లిందట. అమ్మడికి స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది కాని.. డేట్స్ అండ్ పారితోషికం వర్క్ అవుట్ కాలేదు. దానితో చివరకు ఇప్పుడు తెర పై కి రాశి ఖన్నా వచ్చింది.

ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం సినిమా చేసిన రాశి.. ఇప్పుడు మళ్ళీ ఇంకో సారి మెగా క్యాంపస్ హీరో వరుణ్ తో జత కట్టనుంది. ఈసారి ఈ కొత్త మెగా హీరోతో ఒక విజయం ఎంత వరుకు ఉపయోగ పడుతుందో రాశి కెరియర్ కు అనే సంగతి మాత్రం త్వరలోనే తేలుతుంది. అయితే వరుణ్ సినిమాలో రాశి లీడ్ అని ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.