గ్లామర్ డాల్‌గా కనిపించి బోర్ కొట్టేసిందట..

0glamour-dollతొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ఊహల సుందరిగా మారిపోయిన రాశీ ఖన్నా.. క్రమంగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది. వరుసగా టాప్ హీరోల సరసన ఆఫర్లు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్న రాశీ… గ్లామర్‌కు ఆస్కారం ఉన్న పాత్రల్లో చెలరేగిపోతూ… సినీ జనాలకు మరింత చేరువ అవుతోంది. అయితే ఎక్కువకాలం గ్లామర్‌తో నెట్టుకు రావడం కష్టమని త్వరగానే గుర్తించింది ఈ ఢిల్లీ బ్యూటీ. అందుకే సడన్‌గా నటనపైన దృష్టి సారించిన అమ్మడు.. ఓ వైపు గ్లామరస్ రోల్స్‌లో తళుక్కుమంటూనే… నటిగానూ నిరూపించుకోవాలని ఫిక్స్ అయిందట. అందుకే రాశీ తన తాజా చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించేందుకు పచ్చజెండా ఊపేసిందట.

 
గతంలోనూ ఎందరో నాయికలు ఖాకీ చొక్కా ధరించి వీరనారులుగా అలరించిన సంగతి తెలిసిందే. లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి, మాలాశ్రీ, శారద, రమ్యకృష్ణ, టబు, రీసెంట్‌గా నదియా సిసలైన పోలీస్ ఆఫీసర్లుగా తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు వీరి బాటలోనే రాశీ ఖన్నా కూడా ఓ పవర్ ఫుల్ లేడీ పోలీస్‌గా కనిపించేందుకు సిద్ధమవుతోందట. అయితే… అమ్మడు ఏ సినిమాలో ఖాకీ డ్రెస్ వేసుకోబోతోందన్న విషయాలపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, తన రోల్ కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్  మొదలు పెట్టేసిందట.