మోహన్ లాల్ చిత్రంలో రాశి ఖన్నా

0Mohan-lal-and-Rashi-khannaమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన నటించిన ‘మన్యం పులి, ఒప్పం’ వంటి సినిమాలు మలయాళంలోనే గాక తెలుగు, తమిళంలలో సైతం సూపర్ హిట్లవడంతో ఆయన సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ తరుణంలో ఆయన తన సినిమాల్లోకి ఇతర భాషా నటీనటుల్ని కూడా తీసుకుంటూ ఆ క్రేజ్ ను మరింతగా పెంచుతున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్ పూర్తి చేసిన ‘1971 బియాండ్ బోర్డర్స్’ చిత్రంలో తెలుగు హీరో అల్లు శిరీష్ కు ఛాన్స్ ఇవ్వగా తన తరువాతి చిత్రంలో కూడా వేరే తెలుగు నటీనటులకు అవకాశమిచ్చారు.

ప్రస్తుతం ఆయన బి. ఉన్నికృష్ణన్ డైరెక్షన్లో చేస్తున్న ఒక యాక్షన్ థ్రిల్లర్ లో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్ హన్సికలకు మంచి రోల్స్ ఇవ్వగా మరోక తెలుగు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఈ ప్రాజెక్టులో నటించనుంది. ఇందులో ఈమె ఒక టఫ్ పోలీస్ ఆఫిసర్ గా కొత్త గెటప్ లో కనిపించనుంది. దీంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఈ చిత్రం పట్ల మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మరి ఫిబ్రవరి నెలాఖరు నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాని మలయాళంలో పాటు ఈ రెండు భాషల్లో కూడా నేరుగా రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.