అనుమతి లేకుండా ఎలా వేస్తారు: రష్మి

0అనుమతి లేకుండా, సంప్రదించకుండా తన ఫొటోను ఎలా ఉపయోగిస్తారని ప్రముఖ యాంకర్‌, నటి రష్మి ఓ సంస్థపై మండిపడ్డారు. తాము నిర్వహించనున్న కార్యక్రమానికి అతిథిగా రష్మి కూడా హాజరు కాబోతున్నారని ఓ సంస్థ ప్రచురించింది. ఆమె ఫొటోను కూడా ప్రకటనలో ఉంచింది.

దీన్ని చూసిన రష్మి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘నన్ను అడగకుండా నేను అతిథిని అంటూ ఎలా ప్రకటనలో ఉంచుతారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఫొటోలు పెట్టేముందు ఈ సంస్థలు సదరు ప్రముఖుల అధికారిక అనుమతి పత్రాలను ఎందుకు పరిశీలించవు’ అని రష్మి ట్వీట్‌లో పేర్కొన్నారు.

రష్మి ప్రస్తుతం యాంకర్‌గా పలు టెలివిజన్‌ షోలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ఆమె ‘నెక్స్ట్‌ నువ్వే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు. ఆమె కొత్త సినిమా ఇంకా ఖరారు కాలేదు. ఇదే విషయం గురించి ఇటీవల ఓ అభిమాని ట్విటర్‌ వేదికగా రష్మిని ప్రశ్నించగా.. ‘ఇంకా ఏ సినిమాకు ఒప్పుకోలేదు. ఆసక్తికరమైన కథలు రావడం లేదు. సినిమాకు ఒప్పుకుంటే చెబుతా’ అని సమాధానం ఇచ్చారు.