నాకు అప్పుడే పెళ్లేంటి : రష్మి

0Rashmi-Gautam-On-About-Her-Marriageతెలుగు టివి యాంకర్ గా నటిగా యూత్ లో బాగా ఫాలోయింగ్ పెంచుకున్న రష్మి పెళ్లి పై ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తెలుగు కామిడీ షో జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు టివి షో లతో బాగా బిజీ గా ఉంటోంది. ఢీ జోడీ – ఎక్స్ ట్రా జబర్దస్త్ షో యాంకరింగ్ లో తన మాటలతో ఆమె హాట్ లుక్స్ తో అందరినీ అలరిస్తూనే మొన్న షాప్ ఓపెనింగ్ కి వైజాగ్ వెళ్ళి అక్కడ మీడియా తో తన సొంత ఇంటి కల గురించి చెప్పింది. దిన్నీ మనవాళ్లు వేరేలా అర్దం చేసుకున్నారు.

“వైజాగ్ అన్నా ఇక్కడ మనుషులు అన్నా నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటికైనా ఈ సిటీలోనే స్థిరపడతాను” అని చెప్పింది రష్మి. అక్కడే పెరిగింది కాబట్టి అక్కడ వాతావరణం నచ్చి అలా చెప్పి ఉంటుంది. కానీ ఇదే మాట మన వాళ్ళకు వేరేలా అర్ధం అయింది. అక్కడ స్థిర పడుతుంది అంటే తప్పకుండా ఆమె ఎవరనో వైజాగ్ అబ్బాయినే ప్రేమించి ఉండాలి లేదా పెళ్లి కుదిరి ఉంటుంది అని అనుకున్నారు. దీంతో ఒక్కసారిగా రష్మి పెళ్ళంటూ రచ్చ మొదలైంది. ఇదే పుకారు రష్మి దృష్టికి చేరడంతో.. “స్థిర పడటం అంటే పెళ్లి కాదు. నాకు ఆ సిటీ ఇష్టం అందుకే అక్కడ ఉండాలి అనుకుంటున్నా. ఇందులో తప్పేం ఉంది? అయనా నాకు అప్పుడే పెళ్లేంటి?” అంటూ కామెంట్ చేసింది.

యాంకరింగ్ చేస్తున్నే వస్తున్న చిన్న చిన్న సినిమా అవకాశాలు చేస్తూ హీరోయిన్ అండ్ యాంకర్ గా బండి నడిపిస్తుంది. ఇప్పుడ్ ఈమె గీతా ఆర్ట్స్ – యువీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఒక సినిమాలో హీరో ఆది సరసన నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ అవుతుందని వైజాగ్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా రష్మి తెలిపింది.