రష్మిక మార్కెటింగ్ మంత్రం అదేనట!

0

అందరూ ఒకేరకంగా ఉండరని మనందరికీ తెలిసిన విషయమే. కన్నడ బ్యూటీ రష్మిక కూడా అందరిలాగా లేదు. ఎవరైనా హీరోయిన్ కి మంచి బ్రేక్ వస్తే వెంటనే రెమ్యునరేషన్ ఫిగర్ ను మూడు నాలుగు రెట్లు.. లేదా పది రెట్లు పెంచి సొమ్ము చేసుకోవాలని చూస్తారు. సహజంగా అందరూ చేసేది అదే. కానీ రష్మిక రూటే సెపరేటు. రేటు రీజనబుల్ గానే ఉంచిందట. మరి ఇందులో ఆమె లాజిక్కేంటి?

ఇలా అయితే ఎక్కువ ఆఫర్లు వస్తాయని.. రేటు పెంచి కోటి రెండు కోట్లు అంటే చాలామంది నిర్మాతలు దూరం అవుతారని సరసమైన పారితోషికంతో సరిపెట్టుకుంటోందట. మరోవైపు సేమ్ లాజిక్ రిబ్బన్ కట్టింగులకు కూడా పాటిస్తోందని సమాచారం. క్రేజ్ ఉన్న హీరోయిన్లను షాప్ ఓపెనింగ్ లకు పిలుస్తారు కదా.. రష్మిక రేంజ్ హీరోయిన్లు ఒక షాప్ ఓపెనింగ్ కు సహజంగా రూ. 10 లక్షలు తీసుకుంటారట. కానీ రష్మిక మాత్రం అందులో సగం మాత్రమే పుచ్చుకుంటుందట. దీంతో షాప్ ఓపెనింగ్ ఆఫర్లు ఎక్కువగా రష్మిక కే వస్తున్నాయట. యూత్ లో ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి 10 లక్షలయినా ఇచ్చి తీసుకొస్తారు.. అలాంటిది జియో లాగా బంపర్ ఆఫర్ ఇస్తే షాప్ ఓనర్లు మాత్రం ఏం చేస్తారు?

దీంతో తరచుగా రిబ్బన్ కటింగులు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోందట. సినిమాల విషయం లో కూడా రష్మిక తెలివిగా రెమ్యునరేషన్ పెంచకుండా ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంటూ జోరు పెంచుతోంది. ఇదో రకమైన లాజిక్.. గీత ఎకనమిక్స్ అని మనం అనుకోవచ్చేమో..!
Please Read Disclaimer