ఆ హీరోకు గీత లక్కు కాస్త తగులుతుందా?

0చాలామంది జనాలు సెంటిమెంట్స్ లేవంటారు కానీ అదంతా హుళక్కే! ఎందుకంటే పక్కనోడికి సోది చెప్పేందుకే ఇలాంటి టాపిక్కులన్నీ. తమవిషయం వచ్చేసరికి తప్పనిసరిగా సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. సీఎం ల నుండి స్వీపర్ల వరకూ ఎవ్వరూ దీనికి అతీతం కాదు. మీకు డౌట్స్ ఉంటే శుక్రవారం ఎవరినైనా డబ్బు అడగండి..! మన జనాభాలో దాదాపుగా యాభై శాతం మీకు ఇవ్వరు డౌట్ ఉంటె టెస్ట్ చేసుకోండి. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా సెంటిమెంట్స్ చాలానే ఉంటాయి. రెండు హిట్స్ కొడితే లక్కీ హ్యాండ్ అంటారు. ఇప్పుడు రష్మిక మందన్న కు కూడా గోల్డెన్ బ్యూటీ అనే పేరు వచ్చేసింది.

ఫస్ట్ తెలుగు సినిమా ‘ఛలో’ తో సూపర్ హిట్ సాధించిన ఈ కన్నడ సుందరి రెండో సినిమా ‘గీత గోవిందం’ తో బ్లాక్ బస్టర్ సాధించింది. సక్సెస్ మాత్రమే కాదు.. ఇప్పుడు చాలామంది రష్మికను ‘గీత’ అని పిలుస్తున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రష్మిక కు ‘దేవదాస్’.. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో లైన్లో ఉన్నాయి. ఇవి రెండూ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ‘ఛలో’ డైరెక్టర్ వెంకీ కుడుముల తన రెండవ చిత్రం కోసం రష్మికనే హీరోయిన్ గా తీసుకుందాం అని డిసైడ్ అయ్యాడట. దాదాపుగా ఆమె ఈ సినిమాకు కన్ఫాం అయినట్టే. ఈ సినిమాలో నితిన్ హీరో.

‘అ ఆ’ తో నితిన్ మార్కెట్ రేంజ్ పెంచుకున్నాడని చాలామంది భావించారు కానీ నితిన్ కు ఆ ఆనందం కొద్ది రోజులు కూడా నిలవలేదు. వరస ఫ్లాపులు నితిన్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇక గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న రష్మిక అయినా నితిన్ కు లక్ తీసుకొస్తుందేమో వేచి చూడాలి.. మనం కూడా గీత నితిన్ కు లక్ తీసుకురావాలని కోరుకుందాం.