గీతా మేడం డాన్స్ ఓ రేంజ్ లో ఉందే!

0గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో ముద్దు పెట్టించుకుని ఆపై మేడం మేడం అంటూ బ్రతిమాలించుకునే పాత్రలో గీతగా అదరగొట్టిన రష్మిక మందన్న పేరుకు కన్నడ హీరోయిన్ అయినప్పటికీ మనవాళ్ళు మాత్రం తనను పూర్తిగా ఒన్ చేసుకున్నారు. మొదటి సినిమా ఛలోతోనే సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక రెండో సినిమాతో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టడం పట్ల ఆనందం మాములుగా లేదు. 27న విడుదల కాబోతున్న దేవదాస్ మీద కూడా అమ్మడికి చాలా అంచనాలు ఉన్నాయి. హ్యాట్రిక్ ఖాయం అని ఫిక్స్ అయ్యారు ఫాన్స్. ఇక రష్మిక మందన్న చేసింది రెండు సినిమాలే కాబట్టి తన గురించి మనవాళ్ళకు పరిచయం తక్కువ. కానీ రష్మిక మందన్న హీరోయిన్ కాకముందే బెస్ట్ డాన్సర్. దానికి ప్రూఫ్ గా దొరికిన ఒక పాత వీడియో యు ట్యూబ్ లో సంచలనం రేపుతోంది. అందుకే అంత ప్రత్యేకత ఏముంది అంటారా.

రష్మిక మందన్న బెంగళూర్ లో రామయ్య ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ టైంలో జరిగిన ఒక వేడుకలో స్టేజి మీద రేస్ 2 పాటకు హుషారైన స్టెప్స్ ఆహుతుల మతులు పోగొట్టడంతో పాటు తన స్నేహితుల విజిల్స్ తో స్టేజి మొత్తం అదరగొట్టేసింది. దాని తాలూకు వీడియోనే ఇది. ఆ సమయంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసిన రష్మిక తర్వాత క్లీన్ అండ్ క్లియర్ కు చాలా కాలం బ్రాండ్ అంబాసడర్ గా ఉంది. తర్వాత వచ్చిన కన్నడ కిరిక్ పార్టీ అవకాశం తనకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఛలోతో మనదగ్గర ప్రభంజనం మొదలైంది. అందుకే ఈ వీడియో ఇప్పుడు అందరికి పిచ్చగా నచ్చుతోంది. స్లీవ్ లెస్ కుర్తా మీద నడుముకు చున్నీ కట్టుకుని రష్మిక వేసిన స్టెప్స్ కు మన డాన్సింగ్ యూత్ స్టార్ ఎవరైనా తోడైతే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.