ఆ దర్శకుడితో ప్రేమలో ఉన్నానంటున్న హీరోయిన్!

0Rashmika-mandanna-picకన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ తో బాగా పాపులర్ అయిన నటి రష్మిక మందన్న గత కొన్ని రోజులుగా తన ప్రేమ వ్యవహారంలో వస్తున్న రూమర్లకు ఒకేసారి చెక్ పెట్టేసింది. ‘కిరిక్ పార్టీ’ చిత్రంలో తనతో పాటు కలిసి నటించిన నటుడు, ప్రముఖ దర్శకుడు అయిన రక్షిత్ శెట్టి తాను ప్రేమించుకుంటున్నామని, త్వరలో ఒకటి కాబోతున్నామని సోషల్ మీడియా సాక్షిగా పోస్ట్ చేసి అందరికీ కాస్త షాక్ ఇచ్చింది.

ఈరోజు రక్షిత్ శెట్టి పుట్టినరోజు కావడంతో ఫేస్ బుక్ ద్వారా అతనికి విషెస్ చెబుతూనే అతన్ని తన కుటుంబంలోకి ఆహ్వానించింది రష్మిక. దీంతో వీరి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే రష్మిక తెలుగులో నాగ శౌర్యతో ఒక సినిమా చేస్తూనే రామ్ తో మరొక సినిమాకి సైన్ చేసింది.