బ్రేకప్ నిజమే కానీ.. అంటున్న గీత

0మీరు ఎంత సక్సెస్ లో ఉంటే జనాలకు మీమీద అంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు పెద్ద స్టార్ అయితే ఆ ఇంట్రెస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక రష్మిక మందన్న పై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ మామూలుగా లేదు. ‘ఛలో’ తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ విజయంతో టాలీవుడ్ గీత గా మారిపోయిన రష్మిక పర్సనల్ లైఫ్ పై రూమర్లు విపరీతంగా వస్తున్నాయి.

రష్మిక మందన్నకు కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో పోయినేడాది నిశ్చితార్థం జరిగింది. ఈమధ్య బ్రేకప్ వార్తలు వచ్చాయి. రీసెంట్ గా రష్మిక తన అమ్మగారితో కలిసి తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామిని దర్శించుకొని అయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పింది. కానీ ఈ విషయంలో తనపై వస్తున్న రూమర్లను నమ్మవద్దని ఫ్యాన్స్ ను – ప్రేక్షకులను కోరింది. సమయం వచ్చినప్పుడు కారణాలను వెల్లడిస్తామని అంతవరకూ సహనంతో ఉండమని అందరినీ అభ్యర్ధించింది.

ఇదిలా ఉంటే రష్మిక తాజా చిత్రం ‘దేవదాస్’ ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున- నాని కాంబినేషన్ లో తెరకెక్కే ఈ క్రేజీ మల్టిస్టారర్ తో పాటుగా విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.