దానర్థం స్క్రీన్ టైమ్ తక్కువనేగా?

0తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్స్ లిస్టు లో రష్మిక మందన్న పేరు చేరిపోయింది. టాలీవుడ్ లో డెబ్యూ సినిమా ‘ఛలో’ తో హిట్ సాధించిన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో లక్కీ హ్యాండ్ అనే టాక్ వచ్చేసింది. ఇక రష్మిక నెక్స్ట్ ఫిలిం ‘దేవదాస్’ కూడా ఒక క్రేజీ ప్రాజెక్టే.

అక్కినేని నాగార్జున – నాని కలిసి నటిస్తున్న ఈ మల్టిస్టారర్ సినిమాలో రష్మిక నాని కి జోడీగా నటిస్తోంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘దేవదాస్’ సినిమా సైన్ చేసిన కారణం సినిమా కాన్సెప్టేనని – స్క్రీన్ టైమ్ పట్టించుకోలేదని చెప్పింది. దానర్థం సినిమాలో రష్మిక కు తక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందనేగా! సో.. గోవిందాన్ని ఎడిపించినట్టు దాసు ను ఎక్కువ సేపు ఏడిపించడం లేదన్నమాట. ఏదేమైనా స్క్రీన్ టైమ్ కంటే కూడా క్యారక్టర్ కు ఉన్న ప్రాధాన్యతే ఆడియన్స్ కు ఇంపార్టెంట్.

ఇక ఈ సినిమా కాకుండా విజయ్ దేవరకొండతో మరోసారి ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. కన్నడ – తెలుగు భాషల ప్రేక్షకులను మెప్పించిన ఈ భామకు తమిళం నుండి కూడా సూపర్ ఆఫర్లు వస్తున్నాయట.