ఎలుకల మాంసం.. చికెన్‌ వింగ్స్‌గా..

0rat-meat-sold-as-chicken-wingsఎలుకల మాంసాన్ని అమెరికాలో చికెన్‌ వింగ్స్‌ పేరిట రెస్టారెంట్లలో విక్రయిస్తున్నారని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) గుర్తించింది. అయితే కప్ప,ఎలుక, పాములను చైనీయులు లొట్టలేసుకుని తింటున్నట్లు.. అమెరికన్లు తినరనే ఉద్దేశ్యంతో అమెరికా కంపెనీలు ఎలుకల మాంసాన్ని ప్రాసెస్‌ చేసి చికెన్‌ వింగ్స్‌ పేరిట వండి వడ్డిస్తున్నాయి.

వీటికి మంచి గిరాకీ లభించడంతో చైనా కంటెయినర్ల కొద్దీ ఎలుక మాంసాన్ని అగ్రరాజ్యానికి ఎగుమతి చేస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కో పోర్టులోకి వచ్చిన ఓ కంటెయినర్‌ను ఎఫ్‌డీఏ పరిశీలించగా దిగ్ర్భాంతికరమైన ఈ విషయం బయటపడింది. ఏటా అక్షరాలా నాలుగున్నర లక్షల కిలోల ఎలుక మాంసాన్ని విక్రయిస్తున్నారని ఎఫ్‌డీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కడ పడితే అక్కడ ‘బోన్‌లెస్‌ చికెన్‌ వింగ్స్‌’ వంటకాలను తినవద్దని ఎఫ్‌డీఏ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.