సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

రథం ట్రైలర్ టాక్: ప్రేమ పరువు హత్య

0

ఒక చిన్న సినిమా విజయం సాధించడం ఆలస్యం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాక్స్ ఆఫీస్ మీదకు దాడి చేస్తున్న వాటికి కొదవే లేదు. ఆ సిరీస్ లో వస్తున్నదే రథం. కొద్దిరోజుల క్రితం జిమ్నాస్టిక్ తరహాలో ఫోజులో లిప్ లాక్ కిస్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ఇదే. ఇవాళ థియేట్రిరికల్ ట్రైలర్ విడుదల చేసారు. గీతానంద్-చాందిని హీరో హీరోయిన్ గా పరిచయమవుతున్న రథంలో ప్రేమ పగలు హత్యలు పరువులు గ్రామాల్లో జరిగే బలులు జాతరలు నేపధ్యంగా తీసుకుని దాని చుట్టూ ప్రేమ కథ అల్లినట్టుగా కనిపిస్తోంది. మేకింగ్ లో చాల కాంప్రోమైజ్ ఉంది. హీరో గీతానంద్ బాడీకి మించిన హీరోయిజం దట్టించిన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి బ్యాక్ డ్రాప్ అయితే కాస్త విషయం ఉన్నది తీసుకున్నట్టే అనిపిస్తోంది కానీ టేకింగ్ లో క్వాలిటీ మిస్ అవ్వడం వల్ల ఇదో సాధారణ మసాలా పల్లెటూరి ప్రేమ కథ అనే అభిప్రాయం కలిగిస్తోంది.

రాను రాను బడ్జెట్ లో తీసే ప్రేమ కథలు అంటే ఖచ్చితంగా లిప్ లాక్ కిస్సు కాసిన్ని బోల్డ్ సీన్స్ తో పాటు మసాలా ఫైట్లు పెట్టేస్తే చాలు అనుకుంటున్నారు కాబోలు. రథం కూడా అదే దారిలో వెళ్ళింది. గీతానంద్ అనుభవరాహిత్యం చాలా ఫ్రేమ్స్ లో క్లోజప్ షాట్స్ లో క్లియర్ గా దొరికిపోతోంది. హీరోయిన్ చాందిని కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదు. క్యారెక్టర్ ఆరిస్టులు కొందరు చూసిన వాళ్ళలాగే అనిపిస్తున్న మరీ పాపులర్ అనిపించుకున్న వాళ్ళు ఎవరు లేరు. హీరో చేతికి శూలం ఇచ్చి భారీ యాక్షన్ ఎపిసోడ్లు కూడా పెట్టారు. అవేవి అంతగా అతకలేదు. మొత్తానికి ఎవరిదగ్గర స్ఫూర్తి తీసుకున్నా కంటెంట్ తో పాటు మేకింగ్ లో క్వాలీటి లేకపోతే ఇలాంటి రథాలు మెప్పించడం కష్టం. ఇది ట్రైలర్ మాత్రమే కాబట్టి ఫలితం ఇప్పుడే చెప్పలేం. సుకుమార్ పమ్మి దర్శకత్వం వహించిన రథం డేట్ ఇంకా ఖరారు చేయలేదు. దర్శకుడు క్రిష్ ఇవాళ ఈ ట్రైలర్ ని విడుదల చేయించారు
Please Read Disclaimer