ఖైదీ నెం 150లో రత్తాలు ఆడియో సాంగ్

0మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో పాటలను వరుసగా రిలీజ్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పటికే మూడు పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయ్ కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఓ పాట కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

అదే ఖైదీ నంబర్ 150లోని ఐటెం సాంగ్. రత్తాలు రత్తాలు అంటూ సాగుతుందని లహరి మ్యూజిక్ వాళ్లు లీడ్ ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ వెయిటింగ్ మరింతగా పెరిగిపోయింది. ఐటెం సాంగులను ఇరగదీయడంలో స్పెషలిస్ట్ అయిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు’ అంటూ సాగే పాటు అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడు. బీట్ నుంచి ట్రాక్ వరకూ ప్రతీ యాంగిల్ లోనూ ఇరగదీసేసింది ఈ ఐటెం పాట.

పాట మొత్తంలో ప్రతీ బీట్ ఫుల్ లెంగ్త్ చిరు డ్యాన్స్ కోసమే కంపోజ్ చేసిన విషయం అర్ధమైపోతోంది. రత్తాలు పాటలో చిరు స్టెప్పులు ఏ రేంజ్ లో ఉంటాయో అని మెగా ఫ్యాన్స్ ఊహించేసుకుని తెగ మురిసిపోతున్నాయి. ఇక ఈ పాటకు లక్ష్మీ రాయ్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అనే సంగతి తెలిసిందే. ఇక ఐటెం సాంగ్ కూడా రిలీజ్ వచ్చేయడంతో.. ఈ మూవీలో ఒక సిట్యుయేషనల్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్. అది కూడా న్యూఇయర్ గిఫ్ట్ గా ఇచ్చేస్తార్లెండి.