మాస్ రాజా డబల్ ధమాకా!

0మాస్ మహారాజా రవితేజ బాక్స్ ఆఫీస్ సక్సెస్ ల విషయంలో కాస్త స్లో అయిన మాట వాస్తవమే. అలా అని మాస్ రాజాను తీసిపారెయ్యడానికి అసలు వీల్లేదు. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ కు జింతాత జిత జిత ఖాయమే. అందుకే మాస్ రాజా కు చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. మొదటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ అంటోని’ రిలీజ్ అవుతుంది.

ఈ సినిమా తర్వాత కూడా రవి తేజ సినిమా మైత్రీ బ్యానర్ లోనే సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయాల్సి ఉందిగానీ ఆ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టారట. అందువల్ల రవితేజ మరో సినిమాకు పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు కాగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడైన ఈయన రవితేజతో ‘నేల టికెట్ సినిమాను నిర్మించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది గానీ ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా మరో సినిమాకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో రవితేజ డబల్ రోల్ లో తండ్రీ కొడుకులుగా నటిస్తాడని సమాచారం. దర్శకుడు వీఐ ఆనంద్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో అందరినీ మెప్పించిన ఆనంద్ ఆ తర్వాత వచ్చిన ‘ఒక్క క్షణం’ తో ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఇప్పుడు రవితేజ లాంటి మాస్ రాజా ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి.