రవితేజ థాయ్ ల్యాండ్ లో హాలిడేయింగ్!!

0షూటింగ్ మొదలైంది అంటే మారే పనులు పెట్టుకొని హీరో ఎవరైనా ఉన్నారా అంటే మొదట రవితేజ అని చెప్పాలి. ఒక్కసారి కమిట్మెంట్ కి ఫిక్స్ అయ్యారు అంటే రవితేజను ఎవ్వరు చేంజ్ చెయ్యలేరు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. మాస్ రాజా ప్రయివేట్ లైఫ్ గురించి అభిమానులకు తెలిసింది చాలా తక్కువ. ఇకపోతే ఇటీవల కొంచెం గ్యాప్ దొరకడంతో రవితేజ విహార యాత్రలతో ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి మలేషియాలోని స్పెషల్ ప్లేసుల్లో చక్కర్లు కొట్టేస్తున్నారు. కూతురు మోక్షద కొడుకు మహాధన్ తో దిగిన ఫోటోలు రవితేజ అభిమానులతో పంచుకున్నాడు. శ్రీను వైట్ల సినిమా కోసం అమెరికా వెళ్లే ముందు.. ఇలా హాలిడే ఒకటి ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడట.

రీసెంట్ గా రవితేజ నేల టిక్కెట్టు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక అంతకుముందు వచ్చిన టచ్ చేసి చూడు కూడా నీరాశపరిచింది. కథల ఎంఎంపిక విషయంలో మాస్ రాజా మళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నట్లు కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. గత ఏడాది రవితేజ చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం శ్రీను వైట్లతో అమర్ అక్బర్ అంథోని అనే సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా ఇలియానాను ఫిక్స్ చేసుకున్నారు. మూడు విభిన్నమైన పాత్రల్లో మాస్ రాజా ఆ కథలో కనిపించనున్నాడు.