‘రాజా ది గ్రేట్’ టైటిల్ లోగో రిలీజ్!

0ఈ రోజు రవితేజ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్ననే ‘టచ్ చేసి చూడు’ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. విక్రమ్ సిరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ రోజున రవితేజ మరో సినిమా ‘రాజా ది గ్రేట్’ టైటిల్ లోగోను ఆవిష్కరించారు. టైటిల్ లోగోలోనే ఎంతో వైవిధ్యాన్ని చూపించారు.

 దిల్ రాజు నిర్మాణంలో అనీల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆయనని డిఫరెంట్ స్టైల్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మెహ్రీన్ నటించనున్న సంగతి తెలిసిందే.   

raja-the-great