రవితేజ మూవీ ఆగింది.. కారణం ఇదేనా?

0మాస్ మహారాజ్ అన్నంతనే గుర్తుకొచ్చే హీరో రవితేజ. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ గా తీస్తున్న సంగతి తెలిసిందే. అమర్ అక్బర్ ఆంటోనీ పేరుతో నిర్మిస్తున్న ఒక చిత్రం కాగా.. మరొకటి విజయ్ తమిళ్ పోలీస్ రీమేక్ గా అనుకున్నారు.

అమర్ అక్బర్ అంటోనికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుంటే.. రెండో మూవీకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సంతోష్ మూవీని నిర్మాతలు ఆపేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన రషెస్ చూసిన నిర్మాతలు.. ఈ మూవీ విషయంలో ముందుకు వెళ్లకూడదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అమర్ అక్బర్ అంటోనీ ఫలితం చూసిన తర్వాతే ఈ మూవీ సంగతి ఆలోచించాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రవితేజకు రాజా ది గ్రేట్ తప్పించి.. మిగిలిన రెండు చిత్రాలు (నేలటికెట్..
టచ్ చేసి చూడు) రెండు బాక్స్ ఫీస్ దగ్గర బోల్తా కొట్టటం తెలిసిందే. నిర్మాతలకు చుక్కలు చూపించిన ఈ చిత్రాలతో వరుసగా రెండు సినిమాలు వద్దన్న ఆలోచనలో మైత్రీ మూవీస్ భావిస్తున్నట్లుగా సమాచారం.