అఖిల్-శ్రియ పెళ్లి రద్దు.. ఇదే కారణం!

0Akhil-Akkineni-and-Shriyaఅక్కినేని అఖిల్.. శ్రియ భూపాల్ పెళ్లి రద్దవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలుండటం.. ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిపించడంతో ఈ పెళ్లి పక్కా అనే అనుకున్నారంతా. అసలు పెళ్లి రద్దు అనే ఆలోచనే ఎవరిలోనూ లేదు. ముందు వీరి పెళ్లి క్యాన్సిల్ అయినట్లు వార్తలొస్తే అది జస్ట్ రూమర్ అనే అనుకున్నారు. కానీ కొన్ని రోజులు గడిచాక అదే వాస్తవమని తేలింది. ఇక అప్పట్నుంచి ఈ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందనే శోధన మొదలైంది. ముందు ఎయిర్ పోర్టులో అఖిల్.. శ్రియ.. ఆమె తల్లితో గొడవ పడ్డాడని.. చిన్న విషయంలో ఇగో క్లాషెస్ వచ్చి పెళ్లి రద్దు వరకు వెళ్లిపోయిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నాగార్జున ఫ్యామిలీలో ఆస్తుల పంపకానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చల్లో మాటా మాటా పెరిగి పెళ్లి రద్దు వరకు వెళ్లిందని మరో న్యూస్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది.

అఖిల్ పెళ్లి వెంటనే వద్దన్నందుకే శ్రియ నుంచి విడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. తొలి సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్న అఖిల్.. రెండో సినిమా పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టాడట. అసలే చిన్న వయసులో పెళ్లి చేసుకుంటున్నందుకు విమర్శలు వస్తున్నాయని.. పైగా కెరీర్లో తనేమీ ప్రూవ్ చేసుకోలేదని.. అందుకే రెండో సినిమాతో హిట్టు కొట్టాక పెళ్లి పెట్టుకుందామని అఖిల్ అన్నాడట. మేలో అనుకున్న పెళ్లిని వాయిదా వేయాలని కూడా అన్నాడట. ఐతే శ్రియ ఫ్యామిలీ మాత్రం వెంటనే పెళ్లి చేయాల్సిందే అని పట్టుబట్టిందట. ఈ విషయంలో వాదోపవాదాలు జరిగి.. అఖిల్ తీరును అనుమానించి ఈ పెళ్లి వద్దనుకుందట శ్రియ ఫ్యామిలీ. ముందు పెళ్లి రద్దుపై అప్సెట్ అయిన రెండు కుటుంబాలు ఇప్పుడు కాం అయిపోయాయి. ఓ ఎన్నారైతో శ్రియ పెళ్లికి రెడీ అవుతుంటే.. అఖిల్ తన రెండో సినిమా మీద దృష్టిపెట్టాడు.