దీపావళి అయిపోయింది.. ప్రకటన లేదే!

0

‘నాపేరు సూర్య’ సినిమా రిలీజ్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఏంటా అని అభిమానులు కామన్ ఆడియన్స్ చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ తో ప్రాజెక్టు లాక్ అయిందని.. దీపావళి పండగ సందర్భంగా ఓ ఫార్మల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని వార్తలు రావడంతో అందరూ ఆసక్తిగా ఆ ప్రకటన కోసం ఎదురుచూశారు. దీపావళి వచ్చింది.. వెళ్ళింది. కానీ నో ప్రకటన!

అసలేం జరుగుతోంది.. ఎందుకు ఇంకా ప్రకటన రాలేదు? బన్నీ ఈ సినిమాకు ఒక హిందీ రీమేక్ ను ఎంచుకున్నాడట. ఆ సినిమా ‘సోనూ కే టిటూ కి స్వీటీ’. ఈ సినిమా తెలుగు రిమేక్ హక్కులను తీసుకుందామని ప్రయత్నిస్తే టీ-సీరిస్ వారు అందుకు ఆసక్తి చూపించడం లేదట. ఈ సినిమా రీమేక్ రైట్స్ కాకుండా నిర్మాణంలో భాగస్వాములం అవుతామని మెలిక పెడుతున్నారట. అసలే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో నిర్మించాలని బన్నీ- హారికా హాసిని లో నిర్మించాలని త్రివిక్రమ్ టీమ్ అనుకుంటున్నారు. ఈ విషయమే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ గా నిర్మించేందుకు అంగీకారినికి వచ్చినా ఇప్పుడు రీమేక్ రైట్స్ విషయంలో టీ సీరీస్ వారితో చిక్కొచ్చిపడింది.

ఇక ఈ విషయం తేలేవరకూ ప్రకటన ఉండకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ హిందీ సినిమా కాకుండా వేరే ఫ్రెష్ కథ చూద్దామన్నా దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది మరి అల్లువారు ఏం చేస్తారో.. దానికి గురూజి ఏమంటారో?