జయసుధ భర్త ఆత్మహత్యకు కారణం

0Jayasudha-husbandప్రముఖ సినీనటి జయసుధ భర్త అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. ఆర్థికంగా.. మరే విధంగానూ ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్న నితిన్ కపూర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నారన్నది ఇప్పుడు పెద్దప్రశ్నగా మారింది. ముంబయిలో నివసించే ఆయన సూసైడ్ దిశగా ఆలోచనలు ఎందుకు వెళ్లాయన్నది ఒక సందేహంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభైఐదు నిమిషాల సమయంలో తానుండే అపార్ట్ మెంట్ ఆరో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నితిన్ ఆత్మహత్యకు కారణం డిప్రెషన్ గా చెబుతున్నారు. ఆయనీ సమస్యతో గడిచిన కొంతకాలంగా బాధ పడుతున్నట్లుగా చెబుతున్నారు. కుంగుబాటును తగ్గించుకోవటానికి ఇప్పటికే సైక్రియాటిక్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నితిన్ ఆత్మహత్యకు కారణం ఇదని ఎవరూ స్పష్టంగా చెప్పలేనప్పటికీ.. గతంలోనూ ఆయన ఇదే విధంగా ఆత్మహత్యల దిశగా ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. నితిన్ మరణాన్ని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. మరి..పోలీస్ విచారణలో అయినా.. కొత్త విషయాలేమైనా బయటకు వస్తాయో? లేదో..?