కాజల్ అందుకే ఒప్పుకుందట

0సౌత్ లో గత కొంత కాలంగా చక్రం తిప్పుతున్న బ్యూటీ కాజల్. కుదిరితే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేది గాని అవకాశాలు అక్కడ ఎక్కువగా రవడం లేదు. వస్తే గనక తన అందంతో నార్త్ జనాలని బాగా ఆకర్షించేదని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల సౌత్ లో కాజల్ కి అవకాశాలు తగ్గాయి అని కొంత టాక్ వచ్చినప్పటికీ అమ్మడు వరుసగా ఆఫర్లు ఆందుకుంటోంది. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు కాజల్ తో నటించడానికి ఇష్టపడుతున్నారు.

రీసెంట్ గా చందమామ బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర నిర్మించనున్న ఆ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నాడు. అయితే మొదట ఈ ప్రాజెక్ట్ కాజల్ ఒప్పుకోవడానికి ఆమె మార్కెట్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేయడమే అని ఒక న్యూస్ వచ్చింది. కానీ ఇటీవల కాజల్ మరో విధంగా చెప్పిందని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. మెయిన్ గా దర్శకుడు కారణమని కాజల్ వివరణ ఇచ్చిందట.

మొదట దర్శకుడు తేజ కథ చెప్పగానే ఎవరికి ఈ క్యారెక్టర్ ఆఫర్ చేయవద్దు అంటూ తన గురువును రిక్వెస్ట్ చేసిందట. డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఈ సినిమాకు ప్రిపేర్ అవుతానని అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారానే కాజల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక గత ఏడాది నేనే రాజు నేనే మంత్రి సినిమాతో కూడా తనకు మంచి గుర్తింపు వచ్చేలా చేశాడని తేజ డైరెక్షన్ లో మరోసాటి చేయడానికి కాజల్ ఒప్పుకున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.