క‌రుణానిధి న‌ల్ల క‌ళ్ల‌ద్దాల వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదే…

0త‌మిళ‌నాట మ‌రో శ‌కం ముగిసింది. డీఎంకే అధినేత‌, మాజీ సీఎం క‌రుణానిధి మృతితో ఆ రాష్ట్రం వెల‌వెల‌బోతుంది. 94 ఏళ్ల జీవిత గ‌మ‌నంలో 80 ఏళ్లుగా ఉద్య‌మాలు, పోరాటాలు, ఘ‌ర్ష‌ణ‌ల‌తోనే ప‌య‌నించి త‌నువు చాలించిన ద‌క్షిణామూర్తికి ఓ ప్ర‌త్యేక‌మైన అల‌వాటు ఉంది. అదే న‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించ‌డం.

క‌రుణానిధిని క‌ళ్ల‌ద్దాలు లేకుండా చూసిన వాళ్లు చాలా త‌క్కువ మందే ఉంటారు. ఆయ‌న ఇంట్లో ఉన్నా, బ‌య‌ట‌కు వెళ్లినా త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాలు ధ‌రించే ఉంటాడు. ఎందుకు అలా అనే డౌట్ చాలామందిలో వ్య‌క్తం అవుతుంది. దీనిగురించి ఆయ‌న బంధుమిత్రుల‌ను సంప్ర‌దించ‌గా అస‌లు విష‌యం తెలిసింది.

1960వ సంవ‌త్స‌రంలో క‌రుణానిధి ఓ ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ ప్ర‌మాదంలో ఆయ‌న ఎడ‌మ క‌న్నుకు గాయం కావ‌డంతో, క‌ళ్ల‌ద్దాలు ధ‌రించాల్సిందిగా వైద్యులు సూచించారు. వైద్యుల సూచ‌న మేర‌కు ఆయ‌న న‌ల్ల‌ క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించ‌డం మొద‌లు పెట్టాడు. అలా నేటికీ ఆయ‌న న‌ల్ల క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించి 46 ఏళ్లు కావస్తుంద‌ట‌. ఇక ఆయ‌న న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాల‌ను స్టైల్ గా భావించి ఎంతోమంది ఫాలో అయ్యారు. క‌రుణానిధి ఒక్క‌రే కాదు, ఆయ‌న ప్రాణ‌మిత్రుడిగా భావించే ఎంజీఆర్ కూడా న‌ల్ల‌ద్దాల‌నే ధ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రూ న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించి త‌మిళ‌నాట ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశార‌నే చెప్పాలి.