మహర్షి క్రేజ్ ఎందుకు ఆకాశాన్ని తాకట్లేదు?

0

స్టార్ హీరోల సినిమాలకు సాధారణ హీరోల సినిమాలకు ప్రధానమైన తేడా ఏంటంటే క్రేజ్. ఒక సాధారణమైన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ సినిమాలో ఆస్కార్ లెవెల్ కంటెంట్ ఉన్నా జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ స్టార్ హీరో సినిమా అనుకోండి.. కంటెంట్ తో సంబంధం లేకుండా క్రేజ్ నెలకొంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అయితే చెప్పనవసరమే లేదు. క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. కానీ అదేంటో గానీ ఈ సారి ‘మహర్షి’ విషయంలో మాత్రం క్రేజ్ ఉంది. బజ్ ఉంది.. కానీ ఆకాశాన్ని మాత్రం తాకట్లేదు.

నిజం నిష్టూరంగా ఉంటుంది కానీ కొన్ని సార్లు చెప్పుకోక తప్పదు. మొదట టీజర్ విడుదలైన సమయంలో ఉన్న క్రేజ్ ఇప్పటికి తగ్గింది. మరి సినిమా విడుదల పది రోజులలో ఉందనగా సినిమా క్రేజ్ పెరగాలి కానీ తగ్గడం ఏంటి? అలా ఎందుకు జరిగింది? సినిమాలో ఉండాల్సిన ఆకర్షణలు అన్నీ ఉన్నాయి కదా? సూపర్ స్టార్ మహేష్ బాబు.. బ్యూటిఫుల్ పూజా హెగ్డే.. మరో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్ర.. జగపతి బాబు.. రావు రమేష్.. రాజేంద్ర ప్రసాద్ లాంటి ఆర్టిస్టులు.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. హేమా హేమీల్లాంటి ప్రొడ్యూసర్స్ దిల్ రాజు.. అశ్విని దత్ లు. వీటన్నిటికి తోడు క్వాలిటి విషయంలో రాజీ పడకుండా పెట్టిన భారీ బడ్జెట్.

అయినా సినిమాకు బజ్ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అందులో మొదటిది.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం. సహజంగా ఏ సినిమాకైనా దేవీ మ్యూజిక్ ప్లస్ అవుతుంది. ఈ సినిమాకు మాత్రం ఇప్పటి వరకూ ప్లస్ కాలేదు. ఐదు పాటలు రిలీజ్ అయితే ఒక్కటి కూడా చార్ట్ బస్టర్ సాంగ్ లేదు. దేవీ మ్యూజిక్ కాకుండా ప్రేక్షకులకు ఉన్న మరో ఫిర్యాదు ఏంటంటే ఈ సినిమా టీజర్ గట్రా చూస్తుంటే ‘శ్రీమంతుడు’ సినిమా గుర్తు రావడం. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాపై మళ్ళీ బజ్ రావాలంటే మే 1 న జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంటే శరణ్యం. సినిమా ట్రైలర్ విడుదలకు కూడా రంగం సిద్ధం అవుతోంది కాబట్టి ట్రైలర్ కు వచ్చే రెస్పాన్స్ కూడా చాలా కీలకం. మరి ‘మహర్షి’ టీమ్ ఈ విషయంలో ఏం మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.
Please Read Disclaimer