తారక్ అందుకే వెళ్లలేదట

0టాలీవుడ్ లో ఒకే ఫ్యామిలీ కి చెందిన వారి మధ్య విభేదాలు ఉన్నాయని ఏ మాత్రం అనిపించినా రూమర్స్ ఏ రేంజ్ లో వస్తాయో అందరికి తెలిసిందే. అయితే నందమూరి ఫ్యామిలి పై ఇలాంటి గుసగుసలు ఎక్కువగా వినిపిస్తుంటాయు. ఎన్టీఆర్ బాలకృష్ణ మాట్లాడుకోరని అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా వారు సన్నిహితంగా ఉంటారని వారి తరపున మాట్లాడేవారు చాలా చెబుతారు.

ఇకపోతే గత కొంత కాలంగా అభిమానులకు నందమూరి బ్రదర్స్ చాలా ఆప్యాయంగా కలుసుకుంటున్నారు. ఇద్దరికి ఇద్దరు వారికి సంబంధించిన సినిమాల గురించి మాట్లాడటం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉంది. ఇక ఏ మాత్రం వారి మధ్య గ్యాప్ వచ్చినట్లు అనిపించినా రూమర్స్ చాలా స్ట్రాంగ్ గా వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే సినిమాకు తారక్ దూరంగా ఉండడంతో ఊహాగానాలు చాలానే వచ్చాయి. అందుకేనేమో తారక్ వెంటనే కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఓపెనింగ్ కు వెళ్లాడు. దీంతో రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడ్డట్లే అని అనుకున్నారు.

కానీ ఎన్టీఆర్ నా నువ్వే ఆడియో వేడుకకు రాకపోవడంతో మళ్లీ పలురకాల కామెంట్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్ ముందుగా వద్దమనే అనుకున్నాడు. కానీ అదే సమయానికి హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గరి బంధువైన విశాఖ దేవీసీఫుడ్స్ సంస్థ అధినేత ఇంట్లో పెళ్లి ఉండడంతో వెళ్లాడు. హరిక్రిష్ణ కు వీలు పడకపోవడంతో తారక్ ని పంపించాడు. అది తెలియక చాలా మంది పుకార్లు సృష్టించారు. కేవలం పెళ్లి వల్లే తప్ప ఇతర ఏ కారణం వల్ల తారక్ ఆడియో వేడుకకు రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.