ఏమైంది రానా నీకు?

0బాహబలి అనే పదం ఎంత పాపులర్ అయినా… బల్లాలదేవుడు లేనిదే బాహుబలి సంపూర్ణం కాదు. ముఖ్యంగా తెగబలిసిన అడవి దున్నతో పోరాడినపుడు రానా కండలు తిరిగిన బాడీతో ఎంత ఆకట్టుకున్నాడో చూశాం. బాలీవుడ్ లో కూడా రానాకు మంచి ఫాలోయింగే ఉంది. నేనే రాజు నేనే మంత్రిలో బ్రిడ్జి మీద పడిపోతున్న కారును తన పిక్క బలంతో ఆపిన రానాయేనా… ఈ రానా ? అని పై ఫొటో చూసిన వారు అవాక్కవుతున్నారు. కొందరయితే పై ఫొటోలో రానాను గుర్తించడమే కష్టమైపోయిందంటున్నారు. ఇంతకీ ఈ ఫొటో ఎప్పటిదో అనుకుంటారేమో. అది తాజా ఫొటో.

బుధవారం బాబీ దర్శకత్వంలో వస్తున్న వెంకీ-నాగ చైతన్య సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. మీడియాను పిలవలేదు. కనీసం ఫోటోగ్రాఫర్లకూ ఆహ్వానం లేదు. కేవలం యూనిట్ ఫొటోగ్రాఫర్ మాత్రమే కొన్ని ఫొటోలు తీశారంతే. అందులో ఒకట్రెండు మీడియాకు ఇచ్చి మిగతావి వారి వద్దే పెట్టుకున్నారు. మీడియాకు ఇచ్చిన ఫొటోల్లో రానా లేడు. అంత స్టార్ హీరో ఓపెనింగ్ కు వస్తే టపాటపా ఫొటోలు కొట్టేస్తారుగా. కానీ ఈ మధ్య రానా ఆరోగ్యం పై వచ్చిన రూమర్స్ ను అటు సురేష్ బాబు ఇటు రానా కూడా ఖండించారు. రానా తన తరువాత సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అందుకే అది రివీల్ కాకుండా వుండేందుకు ఆ చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నారట. అందుకే కేవలం ఒకట్రెండు మాత్రమే తీయగా వాటిని కేవలం తమ సోషల్ మీడియా అక్కౌంట్లలో పెట్టుకున్నారు .