బైక్ సౌండ్ ఎందుకు మోగుతోంది?

0చెప్పుకోవడానికి ఈ వారం రెండు తెలుగు స్ట్రైయిట్ సినిమాలు ఒక తమిళ డబ్బింగ్ స్టార్ హీరో మూవీ వచ్చాయి కానీ టాక్ అఫ్ ది టౌన్ గా మాత్రం ఆరెక్స్ 100 మాత్రమే ఉంది. మెగా కాంపౌండ్ హీరో డెబ్యూ మూవీతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సినిమా ఇవేవి దీని జోరుకు బ్రేక్ కాదు కదా కనీసం ఝలక్ కూడా ఇవ్వలేకపోతున్నాయి. రివర్స్ లో ఆ పని ఈ సినిమానే చేస్తోంది. ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయేలా మూడో రోజుకే మొత్తం పెట్టుబడి వెనక్కు వచ్చేలా చేయటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ సినిమా ప్రీమియర్ షో ముందు రోజు సాయంత్రం వేసినప్పుడు డివైడ్ టాకే వచ్చింది. బాగుందని కొందరు ఇలాంటి క్లైమాక్స్ మనవాళ్ళు ఒప్పుకోరని కొందరు ఇలా రకరాల కామెంట్స్ బయటికి వచ్చాయి. కానీ అవన్నీ ఉదయం ఫస్ట్ షో దాకా నిలవలేకపోయాయి. అనూహ్యంగా యూత్ టికెట్ కౌంటర్ల బారులు తీరడం చూసి అందరు షాక్ అయ్యే పరిస్థితి. దేవి 70 ఎంఎం లాంటి పెద్ద థియేటర్ సైతం ఇంత చిన్న సినిమాకు హౌస్ ఫుల్ కావడం యూనిట్ సైతం ఊహించి ఉండదు.

దీనికి కారణాలు విశ్లేషిస్తే ఆరెక్స్ 100 తక్కువ బడ్జెట్ లో రూపొందటంతో పాటు బయ్యర్లకు రిస్క్ లేకుండా తక్కువ రేట్లకు ఇచ్చేయడం లాంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా అని లో బడ్జెట్ లో తీసిన ప్రతి సినిమా ఇలా సక్సెస్ అవుతుందని కాదు. కంటెంట్ వీటన్నికంటే ముఖ్యం. ఇప్పటి యువతరంలో పెళ్లిళ్ల దాకా వెళ్లని ప్రేమలే ఎక్కువ. అందులోనూ అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వడం వల్ల ప్రేమ విఫలమైన అబ్బాయిలను లెక్కబెట్టడం కష్టమే. తెలుగు సినిమాలో లీడ్ హీరోయిన్ ని నెగటివ్ షేడ్స్ లో చూపడం చాలా అరుదు. ఇందులో ఇందూ పాత్రను డిజైన్ చేసిన విధానం తాము కూడా ఇలా మోసపోయామే అని కుర్రకారు ఐడెంటిఫై చేసుకున్న తీరు వసూళ్ల రూపంలో రిజల్ట్ ఇస్తోంది.

అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా అని ప్రేమలో పడని వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ఆరెక్స్ 100 కు పోటెత్తున్నారు. దానికి తోడు నెల రోజుల నుంచి చాలా తెలివిగా చేసిన ప్రమోషన్ సినిమాకు బాగా ఉపయోగపడింది. బోల్డ్ కంటెంట్ ని ఓపెనింగ్స్ కోసమే హై లైట్ చేసినప్పటికీ సినిమాలో అంతకు మించి ఉందనే సంతృప్తి మూవీ చూసాక ప్రేక్షకులకు కలగడం వల్ల మౌత్ పబ్లిసిటీ రూపంలో పాకిపోతోంది. ఫ్యామిలీని టార్గెట్ చేయలేదు కాబట్టి ఆరెక్స్ 100 తాను కోరుకున్న సెగ్మెంట్ ని విజయవంతంగా చేరుకోగలిగింది. మూడో రోజుకే మూడు కోట్ల షేర్ దరిదాపుల్లోకి వెళ్తున్న ఆరెక్స్ 100 జోరు ఇదే రకంగా కొనసాగితే బ్లాక్ బస్టర్ హిట్ దిశగా అడుగులు సరిగ్గా పడుతున్నట్టే