జబర్దస్త్ షోలో గొడవకు కారణం ఇదే!

0Rashmi-and-sudigali-sudheerప్రముఖ తెలుగు ఛానెల్‌ ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌లో ఇటీవల వస్తున్న ప్రోమోని చూసే ఉంటారు. ఈ షోలో ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ టీమ్‌ని ఓ రేంజిలో ఉతికి ఆరేసారు జడ్జిలు రోజా, నాగబాబులు. మార్చి 31, శుక్రవారం నాడు ప్రసారం కానున్న షోలో ఈ గొడవను మొదలుపెట్టింది రష్మీ.

“అసలేంటి మీరు పెద్ద తోపులనుకుంటున్నారా” అని రష్మీ అనడంతో గెటప్ శీను ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. స్కిట్ బాగానే వచ్చింది నువ్ జడ్జీలను కనుక్కోమంటూ. అసలు ప్రాబ్లెం ఏంటి మీకు అంటూ మొదలెట్టిన నాగబాబు ఘాటైన పదజాలంతో స్టేజీపై ఉన్న మొత్తం బృందాన్ని గెటౌట్ అనే వరకు వెళ్లిపోయాడు. ఇదీ ఈ ప్రోమోలో ఉన్నది.

ఇంతకీ దీని వెనుక నిజాలేంటంటే ఈ ఎపిసోడ్‌ తర్వాత రోజు ఏప్రిల్ 1 కావడంతో జనాలందర్నీ ఒకరోజు ముందే అంటే మార్చి 31నే ఫూల్స్ చేసేసారట. జనాలందర్నీ ఊదరగొట్టేసి, టెన్షన్ క్రియేట్ చేసేసి, లేనిపోని హడావుడి చేసేసిన తర్వాత షో చివర్లో అబ్బే ఇదంతా ఉత్తుత్తిగానే అనేసి, ఏప్రిల్ ఫూల్ అనేయబోతున్నారని వినికిడి.

ఏది ఏమైనా, అసలు కథే ఇదేనన్న విషయం రేపటి ప్రసారంలో తేటతెల్లం అయిపోతుంది.