అత్తారింటికి దారేది శాటిలైట్ రైట్స్ లో మరో రికార్డ్

0



పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం “అత్తారింటికి దారేది” ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు విపరీతమైన పోటి ఏర్పడింది. మాకు అందిన సమాచారం ప్రకారం మా టీవీ వారు ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ బారి మొత్తం లో తొమ్మిది కోట్లు కు కొనుగులు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఇంత మొత్తం లో కొనుగులు చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్. మా టీవీ వారు గబ్బర్ సింగ్ కు పెద్ద మొత్తం లో (TRP Rating) రావడం తో ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ కొనుగులు చేసిన్నారు. అలాగే త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా కూడా మంచి విజయం సాదించడం తో ఇప్పుడు ఈ కాంబినేషన్ లో చిత్రం అంటే సినీ అభిమానుల అందరికి అంచనాలు పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. ఈ చిత్రం లో పవన్ సరసన సమాంత, ప్రాణిత నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తునాడు.BVSN. ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఆగష్టు 7 న రిలీజ్ చేయడానికి నిర్మాత సన్నహాలు చేస్తున్నారు.