షియోమీ సూపర్ ఆఫర్.. రూపాయికే రెడ్‌‌మీ 4ఏ స్మార్ట్‌ఫోన్!

0Redmi-note-4చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారత్‌ వినియోగదారులకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. తన ఎంఐ బ్రాండ్‌ను ప్రారంభించి మూడేళ్లు అవుతున్న శుభసందర్భంగా రెండు రోజులపాటు ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్టు తెలిపింది. గురు, శుక్రవారాల్లో నిర్వహించే ఈ సేల్‌లో కంపెనీ యాక్సెసరీలతోపాటు రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు, సరికొత్త పవర్ బ్యాంకులను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. అలాగే 20, 21 తేదీల్లో ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నట్టు పేర్కొంది.

ఫ్లాష్‌సేల్‌లో భాగంగా రూపాయికే రెడ్‌మీ 4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు 2 తదితర వాటిని సొంతం చేసుకోవచ్చు. గోఇబిబో ద్వారా దేశయంగా హోటల్స్ బుక్ చేసుకున్న వారికి రూ.2వేల రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్, రూ.8 వేలకు పైన కొనుగోలు చేస్తే ఒక్కో కార్డుపై రూ.500 క్యాష్‌ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.