రెజీనా జాతకం మారుతుందా??

0reginaమంచి ట్యాలెంట్ వున్నా టాలెంట్ కి తగ్గ అవకాశాలు అందుకోలేకపోయింది రెజీనా. సినిమాల ఎంపికలో చేసిన కొన్ని తప్పులు రెజీనాను స్టార్ హీరోయిన్ రేసులో నుంచి కొంత కిందకు లాగితే దురదృష్టం ఇంకొంత కిందకు లాగింది.

మధ్యలో బాలీవుడ్ కి వెళ్ళింది. రెండేళ్ల క్రితం రెజీనాకు హిందీలో ‘ఆంఖేన్2’లో నటించే ఆఫర్ వచ్చింది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్షి వంటి స్టార్స్ సినిమా కావడంతో రెజీనా వెంటనే ఓకే చెప్పింది. ముంబైలో జరిగిన ఓపెనింగ్ ప్రోగ్రాంలో బికినీ వేసుకుని అందాలు ఆరబోసింది. అప్పుడు అది సంచలనం రేపింది. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండా మధ్యలో ఆగింది.

అయితే ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ అంటోంది. హిందీలో రాజ్‌కుమార్ రావు, సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా రూపొందనున్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో హైసీ లాగా’లో రెజీనాకు ఒక రోల్ ఆఫర్ చేశారని, ఆమె ఓకే చెప్పిందని టాక్. మరి ఈ సినిమాతోనైనా అమ్మడి జాతకం మారుతుందేమో చూడాలి.