రెజీనా గ్లామర్.. పీక్స్ లో ఉందంతే

0రెజీనా కసాండ్రా చేతిలో ఇప్పుడు నక్షత్రం మినహాయిస్తే.. మరో తెలుగు ప్రాజెక్ట్ ఏదీ లేదు. ఒకానొక సమయంలో కాబోయే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రెజీనా.. ఆ తర్వాత బాగా స్లో అయిపోయింది. జ్యో అచ్యుతానంద లాంటి సినిమాలో పెర్ఫామెన్స్ తో మెప్పించినా.. ఈ భామకు అంతగా అవకాశాలు మాత్రం. ఇప్పుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం మూవీలో తన ట్యాలెంట్ అంతా చూపించేసినట్లుగా ఉంది రెజీనా.

క్లాస్ టచ్ ఉన్న పాత్రలను చక్కగా మెప్పించే రెజీనా.. ఇప్పుడు నక్షత్రం మూవీలో అందాలు ఆరేసిన తీరు చూస్తే అవాక్కవాల్సిందే. గతంలో కూడా ఈ బ్యూటీ ఎక్స్ పోజింగ్ చేసింది.. డ్యాన్సులు చేసింది.. కానీ రీసెంట్ గా నక్షత్రం ఆడియో ఫంక్షన్ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమోస్ లో ఒకటి అయిన ‘లాయిరే లాయిరే’ ప్రోమో చూస్తే.. రెజీనాను కొత్తగా చూస్తున్నట్లుగాకాదు.. కొత్త రెజీనాను చూస్తున్నట్లు అనిపించక మానదు. డ్రెసింగ్ నుంచి డ్యాన్సింగ్ వరకూ.. పెర్ఫామెన్స్ నుంచి ప్రదర్శన వరకూ అన్ని యాంగిల్స్ లోనూ కొత్తకొత్తగా కనిపించింది రెజీనా కసాండ్రా.

ఈ మూవీతో ఎలాగైనా టాలీవుడ్ జనాలకు.. ఆడియన్స్ కు తన ట్యాలెంట్ చూపించేందుకు గట్టిగా ఫిక్స్ అయినట్లుగా ఉంది రెజీనా. ఇక కృష్ణవంశీ మేకింగ్ కి.. స్పెషల్ గా డిజైన్ చేయించిన బోలెడన్ని కాస్ట్యూమ్స్ కూడా తోడవడంతో.. నక్షత్రంలో రెజీనా ఏ మాత్రం తగ్గకుండా అందాల నుంచి ట్యాలెంట్ వరకూ చూపించేసింది.