స్టాలిన్ తో కలిసి రెచ్చిపోయిన రెజీనా

0రెజీనా కసాండ్రా ఈ మధ్య టాలీవుడ్ పై పెద్ద కామెంట్స్ నే చేసింది. వరుసగా తమిళ్ లో నాలుగు అవకాశాలు వచ్చేసరికి.. హీరోయిన్స్ ట్యాలెంట్ ను తెలుగు జనాలు గుర్తించరని అనేసింది. అలా రెజీనాకి వచ్చిన కొన్ని అవకాశాల్లో ఒకటి ‘శరవణన్ ఇరుక్క బయమేన్’. శరవణన్ ఇక్కడుంటే భయమెందుకు అని దీని అర్ధం.

హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ గత శుక్రవారమే థియేటర్లలోకి వచ్చేసింది. సక్సెస్ ఆశలు తీరతాయని రెజీనా పెట్టుకున్న తొలి షో నుంచే కల్లలైపోయాయి. అందుకే రిలీజ్ రోజునే ఓ రొమాంటిక్ సాంగ్ ను పూర్తిగా నెట్ లో పెట్టేశారు మేకర్స్. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకూ ఉదయనిధి స్టాలిన్- రెజీనా కసాండ్రాల రొమాన్స్ నేపథ్యంలో సాగే ఈ పాట.. మ్యూజికల్ గా కూడా ఆకట్టుకుంటుంది. ఎన్నేసి అట్రాక్షన్స్ ఉన్నా.. రెజీనా చూపించిన అందాలు.. వాటిని ప్రదర్శించడంలో తెగువ.. ఇంటిమేట్ సాంగ్ లో అమ్మడి ముఖంలో పలికే భావాలే అన్నిటి కంటే ప్రధానం.

ఒక్కపాటలోనే ఇంతగా రెచ్చిపోతే ఇక సినిమా అంతా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే.. ఈ సినిమా కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూలు.. మౌత్ టాక్ తోనే ప్రయాణం ప్రారంభించడంతో.. సక్సెస్ తీరాన్ని చేరడం అంత తేలికేమీ కాదు. రెజీనా అందాల ఆరబోత వృథా అయిపోయినట్లేనా అనుకుంటున్నారు అభిమానులు.