తెరాసకు రంగు పడింది

0TRS-Party-Flagఒకోసారి భలే చిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయ్‌.. గులాబి రంగంటే తెరాస, తెరాస అంటే గులాబి రంగు అన్నంతగా ఫేమస్‌ అయిపోయాయి తెలంగాణ ప్రాంతంలో. కానీ ఇప్పుడా పింక్‌ కలరే పుచ్చె రెగ్గొట్టలా వుంది. ఎన్నికల సంఘం తెలియక చేసిందో, తెలిసీ కావాలని చేసిందో తెలియదు కానీ, రిజక్ట్‌ బటన్‌ రంగు గులాబీ అట. ఇది తెలిసిన దగ్గర నుంచి తెరాస శ్రేణులకు నిద్ర కరువైంది.

 ఇటీవల సుప్రీంకోర్టు, రిజెక్ట్‌ బటన్‌ అంటే, సరి అయిన  అభ్యర్థి కాకుంటే తిరస్కరించే అవకాశాన్ని ఓటరుకు ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే.  ఆ మేరకు ఇఓఎమ్‌ (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు)లలో రిజెక్ట్‌ బటన్‌ ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది ఎన్నికల కమిషన్‌. అయితే ఈ రిజెక్ట్‌ బటన్‌ గులాబి రంగులో వుంటుందని వార్తలు అందాయి. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈ రంగు మార్చాలంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు.

 ఎందుకంటే  జనాలకు గులాబి రంగు మనసులో ముద్రపడిపోయి వుంది. అది రిజెక్ట్‌ బటనా, మరోటా అన్నది నిరక్షరాస్యక ఓటర్లకు అనవసరం. గులాబి రంగు వుంది..నొక్కేద్దాం అన్నదే ధ్యాస. ఇలాగే జనం ాలోచిస్తే, కొంప కొల్లేరవుతుందని  తెరాస నాయకులు భయపడుతున్నారు. జనం అంతా మూకుమ్మడిగా రిజెక్ట్‌ బటన్‌ నొక్కితే, తెరాస మొత్తం రిజెక్ట్‌ అయిపోతుంది. అందుకే ఈ రంగు మార్చాలని వారు డిమాండ్‌ చేస్తన్నారు.

Tags : తెరాసకు రంగు పడింది, Election Commission , Trs, Rose Color, Reject Button, reject button to be in pink