స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీస్ కోసం జియో కొత్త ఆన్‌లైన్ స్టోర్..!

0jioరిలయన్స్ సంస్థ ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో తన జియో స్మార్ట్‌ఫోన్లు, జియో ఫై హాట్ స్పాట్ ఇతర జియో యాక్ససరీస్‌ను రిలయన్స్ డిజిటల్ సైట్‌లో అమ్ముతూ వచ్చింది. అయితే ఆయా ఫోన్లు, యాక్ససరీస్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. జియో సైట్ (www.jio.com)లోనే షాపింగ్ కార్ట్ పేరిట ఓ కొత్త లింక్ ఇప్పుడు దర్శనమిస్తోంది. అందులోకి వెళ్తే యూజర్లు లైఫ్ ఫోన్లతోపాటు జియో ఫై హాట్‌స్పాట్ డివైస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ప్రత్యేక పోర్టల్‌లో ప్రస్తుతం లైఫ్ వాటర్ 11, వాటర్ 8, ఎర్త్ 1 స్మార్ట్‌ఫోన్లు, జియోఫై డివైస్ మాత్రమే యూజర్లకు లభ్యమవుతున్నాయి. త్వరలో మరిన్ని లైఫ్ స్మార్ట్‌ఫోన్లను ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు చేసేందుకు జియో వీలు కల్పించనుంది.