అకీరా హైట్ ఎంతో తెలుసా?

0రెండు మూడేళ్ల కిందటి వరకు కూడా తల్లి చాటు తనయుడిగా… పాల బుగ్గల పసివాడిగా కనిపించాడు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్. తల్లి రేణుదేశాయ్ దగ్గరే పెరిగిన అకీరా అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చిపోతూ మీడియా కంట పడుతుండేవాడు. ఏదో విధంగా ఆయన ఫొటోలు తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తుండేవి. ఎప్పుడూ ఎదిగే సగటు పిల్లాడిలాగే కనిపించేవాడు అకీరా. అయితే ఈ యేడాది ఆయన ఎదుగుదల అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తండ్రి పవన్ కళ్యాణ్ కంటే ఎత్తు పెరిగాడు. మొన్నటివరకు కనిపించిన అకీరానేనా అన్నట్టుగా మారిపోయాడు.

ఆ విషయంపై తల్లి రేణుదేశాయ్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ `అవును.. నా కంటే అకీరానే హైట్. నా ఎత్తు 5.8 అడుగులైతే – అకీరా 6.3 అడుగులు“ అంటూ సీక్రెట్ ని బయటపెట్టింది. ప్రస్తుతం రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫారిన్ లో గడుపుతోంది. వెకేషన్ కోసం వెళ్లిన ఆ ముగ్గురు జాలీ జాలీగా గడపుతున్నారు. అక్కడ తీసుకొన్న ఫొటోల్ని రేణుదేశాయ్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. “14 యేళ్లకే 6.3 అడుగులు ఎత్తు పెరిగాడు అకీరా. తను ఎంత ఎత్తుకి ఎదిగినా నా బేబీనే“ అంటూ ఫొటోలతో పాటు కామెంట్ ని పెట్టింది రేణు. ఆమె ఇటీవలే కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పవన్ నుంచి విడిపోయిన ఆమె మరో వివాహం కోసం రెడీ అవుతోంది. ఇటీవలే రేణు నిశ్చితార్థ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ యేడాదిలోనే ఆమె వివాహం జరగనుందని తెలుస్తోంది.