తెలుగు సినిమా తీస్తా: రేణు దేశాయ్

0తరచుగా వార్తల్లో నిలిచే సెలబ్రిటీల్లో రేణు దేశాయ్ ఒకరు. పవన్ మాజీ భార్యగా కావచ్చు లేదా మరే ఇతర కారణాలేవైనా కానివ్వండి.. ఆమె ఏదో ఒక విషయానికి సంబంధించి వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్ గా రెండో వివాహం చేసుకున్న రేణు ఇప్పుడు తన ప్రోఫెషన్ మీద కుడా దృష్టి పెడతానని అంతోంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తానని తెలిపింది.

అంటే నటిగా కాదు. దర్శకురాలిగా ఒక తెలుగు సినిమాను తెరకెక్కిస్తుందట. ఇంతకీ ఆమె ఏ జోనర్ లో సినిమా చేస్తోంది? ఆమె సినిమా రైతు ఆత్మహత్యల నేపథ్యం లో సాగుతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ రాయడం పూర్తయిందని త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తానని అంటోంది. అంతే కాదు ఈ సినిమాను ఆమె నిర్మిస్తుందట. దీనికి కొంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉందని అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామం లో కొన్ని రోజులు నివసించి – అక్కడ పేద రైతుల కష్ట నష్టాలను వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను స్వయంగా పరిశీలించి అప్పుడు సినిమానును తెరకెక్కిస్తుందట.

దర్శకత్వం అనేది రేణుకి కొత్త కాదు.. ఇదివరకూ మరాఠీ లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే పేరుతొ ఒక రొమాంటిక్ కామెడీ ని తెరకేక్కించింది. కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది. మరి ఆమె తెలుగులో డైరెక్ట్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి.