స్టార్ మాలో ఇక రేణూదేశాయ్ విశ్వరూపం

0Renu-Is-Ready-With-Neethoneపవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సరికొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. ఇప్పటికే బిగ్‌బాస్ రియాల్టీ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ మా లో ఈమె.. నీతోనే డ్యాన్స్ అన్న కాన్సెప్ట్‌లో చక్కని రియాల్టీ షోకి ఆమె హోస్ట్‌గా వ్యవహరించనుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షో పూర్తి కాగానే ” నీతోనే ” డ్యాన్స్ షో లాంచ్ కావచ్చు. ఈ షోలో భాగంగానే రేణూ దేశాయ్ ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేసింది. హిందీలో హిట్టయిన ” నాచ్ బలియే ” తెలుగు వెర్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రేణూ. ఇక స్టార్ మాలో ఈ షోని రక్తి కట్టించవచ్చు. (హిందీలో మాధురీ దీక్షిత్ హోస్ట్‌గా ఆ షో పాపులర్ అయింది.). ఈ షో తనకొక కొత్త ఫీల్ నిస్తుందని రేణూ ఆశిస్తోంది.