మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రేణూదేశాయ్

0Renu-Desai-marriage-Againరేణూ దేశాయ్.. తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే కాకుండా ఓ స్వతంత్ర మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత తెలుగు తెరకు దూరమైన రేణూ.. ఇప్పుడు ఓ డ్యాన్స్ షో ద్వారా బుల్లితెరపై తెలుగువారందరి ఇళ్లలోకి వచ్చేశారు. దసరా సందర్భంగా తెలుగువారికి మరోసారి దగ్గరైన రేణూ మళ్లీ పెళ్లి చేసుకొనే ఆలోచనలో ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

‘‘ఏడాది క్రితం వరకు నాకు పెళ్లి ఆలోచనే లేదు. కానీ, ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకంటూ ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుందనిపించింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది. నాకు ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు మా అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అనిపించింది. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని. ఆ ఇన్సిడెంట్‌కు ముందు నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది. చూద్దాం ఏదైనా రాసుంటే.. ఎందుకంటే మనకు తెలీదు కదా.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ప్రస్తుతానికి ఎవరూ లేరు. దేవుడు ఎవరినైనా పంపిస్తే చూద్దాం.’’ అంటూ తన మనసులోని బాధను, భావాన్ని వ్యక్తం చేశారు రేణూ దేశాయ్.