రెండో పెళ్లిపై రేణుదేశాయ్..

0Renu-Desaiపవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన భార్య రేణుదేశాయ్ విడిపోయినా వారిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటారు. పిల్లల పుట్టిన రోజు వేడుకలకు, ఇతర స్పెషల్ డే రోజున రేణు దేశాయ్ ఇంటికి వెళ్లి తన కూతురు, కుమారుడితో గడుపుతాడు. వైవాహిక జీవితంలో విభేదాలు ఉన్నా వ్యక్తిగతం పవన్, రేణు చాలా ఫ్లెండ్లీగా ఉంటారు అని చెప్పుకొంటారు. గత కొద్దికాలంగా పవన్ నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న రేణుదేశాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై స్పందించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ వార్త సారాంశమేమిటంటే..

పవన్ కల్యాణ్‌తో తన అనుబంధం ప్రత్యేకమైనది. ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండిపోతాను. ఆయన మాజీ భార్యగానే చలామణి అవుతాను. సినీ పరిశ్రమలో సొంత గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తాను అని అన్నట్టు కథనం వెలువడింది.

పవన్ నుంచి నేను విడాకులు తీసుకొన్నప్పటికీ.. తాను మరో వివాహం చేసుకోను. పవన్ మాజీ భార్యగానే మంచి గుర్తింపు ఉంది. పవన్ అభిమానులంతా నన్ను వదిన అని పిలుస్తుంటారు. ఆ పిలుపులో వారి అభిమానం, ప్రేమ కనిపిస్తుంది.

మరో పెళ్లి చేసుకోవడం ద్వారా పవన్ ప్రేమకు, ఫ్యాన్స్ అభిమానానికి దూరం కాలేను. జీవితంలో జరిగే సంఘటనలను ఆపలేం. ఏది జరిగినా మన మంచికే అని భావించాలి అనే భావనను ఆమె వ్యక్తం చేసినట్టు సమాచారం.

పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత రేణుదేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్నది. మరాఠీ చిత్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు కోసం రేణూ ప్రయత్నిస్తున్నది.