వారికి పద్మశ్రీ ఇవ్వాలంటున్న రేణు దేశాయ్

0పవన్ కళ్యాన్ మాజీ భార్య గానే కాక ఒకప్పటి హీరోయిన్ గా కూడా తెలుగు ప్రేక్షకులకు రేణు దేశాయ్ పరిచయమే. పవన్ తో విడిపోయిన ఈమె మళ్ళీ రెండో పెళ్లి కోసం నిశ్చితార్థం చేసుకోగా కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు హేట్ మెసేజ్ లతో ఆమెను విసుగెత్తించగా రేణు ఇన్స్టాగ్రామ్ వదిలి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె ఫాన్స్ ప్రశ్నలకు జవాబులు చెప్తూ వీడియో చేసింది.

పవన్ కళ్యాణ్ పెళ్లికి వస్తాడా అన్న ప్రశ్నకి మీ హీరో సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంటాడుగా ఆయననే అడగండి అని సమాధానమిచ్చింది. పెళ్లి తర్వాత అకీరా ఎక్కడుంటాడాని తన భవిష్యత్తు ఏమవుతుంది అని అడగగా పెళ్లి తనకు కానీ అకీరా కు కాదని కాబట్టి పెళ్లి తర్వాత కూడా పిల్లలు తనవద్దనే ఉంటారని ఇక భవిష్యత్తు కోసం తనకు ఒక పెద్ద కుటుంబం అండగా ఉందని స్పష్టం చేసింది. పెళ్లయ్యాక పవన్ తిరిగి రమ్మంటే వస్తారా అని అడిగితే ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారికి పద్మశ్రీలు పద్మభూషణ్ లు ఇవ్వాలని చురకంటించింది.

వీడియో చేస్తున్న సమయంలో అకీరా అక్కడకు వచ్చి తల్లికి అభినందనలు చెప్పడం విశేషం. దానికి రేణు “థాంక్యూ బేబీ. నువ్వే నా జీవితం” అంటూ బదులిచ్చింది. అకీరా సినిమాల్లోకి వస్తాడా అంటే ఇప్పుడు తన మనసులో అలాంటి ఆలోచనలు లేవని తనింకా తొమ్మిదో తరగతిలోనే ఉన్నాడు కెరీర్ లో ఒక నిర్ణయం తీసుకోడానికి ఇంకొంత టైం ఉందని సెలవిచ్చింది.