మోడీ టార్గెట్ బాబు..కేసీఆర్ టార్గెట్ నేను

0అనూహ్య రీతిలో సుదీర్ఘకాలం తర్వాత తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్న ఈ ఎపిసోడ్ను తెలంగాణ సీఎం కేసీఆర్ తవ్వితీయడం కలకలం రేకెత్తిస్తోంది. ఈ పరిణామాలపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. మోడీపై బాబు కేడీపై తాను పోరాడుతున్నందుకే కేసుల తిరగదోడుతా అంటున్నారని ఆరోపించారు.

మమ్మల్ని బెదిరించి లొంగదీసుకోవలని మోడీ – కేడీ అనుకుంటున్నారు కానీ అది అయ్యే పని కాదు అని రేవంత్ రెడ్డి తెలిపారు. `2016 సంవత్సరం లో ఏసీబీ కేసులో దొరికిన వాళ్లలో 125 మంది పై కేసులు ఎత్తివేశారు. ఏసీబీ కేసులు ఎత్తివేయడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దవినీతి పరులను కాపాడడంలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిమ్స్ మాజీ డైరెక్టర్ శేషగిరిరావు లంచం తీసుకుంటూ పట్టుబడితే కేసు కొట్టివేశారు. కేసీఆర్ బంధువు కాబట్టే శేషగిరిరావును కేసు నుంచి బయట పడేశారు. కేసీఆర్ బంధువులు అయితే చాలు కేసుల నుంచి బయటపడొచ్చు. సంజీవ్ రావు అనే ఏసీపీ పై కేసును కూడా ఉపసంహరించారు. సంజీవ్ రావు కూడా కేసీఆర్ బంధువు` అని ఆరోపించారు. జీహెచ్ఎంసీకి చెందిన పురుషోత్తం రెడ్డి విషయంలో రేవంత్ ఆశ్చర్యకరమైన వార్తలు చెప్పారు.“పురుషోత్తంరెడ్డి మొత్తం దేశాన్ని దోచేసినట్లు చెప్తున్నారు. పురుషోత్తం రెడ్డి ఎక్కడ పట్టుబడలేదు. కేటీఆర్ చెప్పిండనే ఒకే కారణంతో పురుషోత్తం రెడ్డి పై కేసు బుక్ చేశారు. కేసీఆర్ బంధువులు డబ్బులు తీసుకుంటూ పట్టుబడితే అవి కొట్టేస్తున్నారు. మిగతా వాళ్లపై కక్షసాధింపునకు దిగుతున్నారు. పాపారావు అనే సలహాదారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని వార్తలు వచ్చిన పట్టించుకోరు.`అంటూ మండిపడ్డారు.

టీఆర్ఎస్ ప్లీనరీ పేరుతో రాష్ట్రాన్ని మంత్రులు దోచేశారని రేవంత్ ఆరోపించారు. `వందల కోట్ల వసూళ్లపై కేసులు వేసిన కోర్టు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. వేముల వీరేశం ఒక అధికారికి పని చేస్తే 8లక్షల లంచం ఇస్తా అన్నాడు. ఆ సాక్ష్యాలతో ఏసీబీకి ఫిర్యాదు చేశాం. కేటీఆర్ లంచం తీసుకోవాలని చెప్పాడని సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ చెప్పారు. అయినా చర్యలు లేవు. గులాబీ కూలీ పేరుతో వసూళ్లు వేముల వీరేశం అధికారికి లక్షల్లో లంచం ఇస్తా అన్నాడు ఇవి తేల్చండి ముందు. మోడీకి కేడీ కి భయపడే ప్రసక్తే లేదు. మోడీకి – కేడీకి భయపడే ప్రసక్తే లేదు` అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తనను చంద్రబాబును బెదిరించి లొంగదీసుకోవాలంటే అది మోడీ కేడీ వల్ల కాదని రేవంత్ రెడ్డి అన్నారు. `
కర్ణాటకలో మోడీ ని ఓడించమని బాబు పిలుపు ఇచ్చినందుకు కక్షసాధింపుకు దిగుతున్నారు. మోడీ-కేసీఆర్ ఇద్దరు ఒక్కటే. కేసీఆర్ నిర్ణయాల వెనుక మోడీ ఉన్నాడు. మోడీ టార్గెట్ బాబు కేసీఆర్ టార్గెట్ నేను. కేసీఆర్ – అసద్ కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నారు. జేడీఎస్ బీజేపీకి మద్దతు ఇస్తోంది ఇక్కడే అర్థం అవుతుంది కేసీఆర్ మోడీ ఒక్కటే అని` అంటూ రేవంత్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.