శ్రీదేవి గురించి మరీ ఇంత దారుణంగా మాట్లాడతారా ?

0శ్రీ‌దేవి మ‌ర‌ణం పూట పూట‌కూ ఓ కొత్త‌మ‌లుపు తీసుకుంటోంది. ఎన్ని అనుమానాలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఆవేదనకు గురి చేస్తున్నాయి. . శ్రీదేవి బతికున్నప్పుడు ఆమె అందం, అభినయం గురించి మాట్లాడుకున్నారని చనిపోయాక ఆమె భౌతికకాయం, రక్తంలో మద్యం ఆనవాళ్ల గురించి మాట్లాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు వర్మ.

‘ఒకప్పుడు శ్రీదేవి అందమైన కళ్లు, పెదాలు, శరీరాకృతి గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు శ్రీదేవి భౌతికకాయం, రక్తంలో మద్యం ఆనవాళ్లు, ఊపిరితిత్తుల్లో నీరు గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుడా..!’ అంటూ తనదైన శైలి ఓ ట్వీట్ పెట్టాడు వర్మ. కాగ. శనివారం దుబాయ్ లో మరణించిన శ్రీదేవి బౌతికకాయం ఇంకా ఇండియా చేరుకోలేదు. ఆమె మరణం పై కూడా చాలా అనుమానాలు వున్నాయి.